గురువారం నరసరావుపేట మండలం ఇస్సపాలెం గ్రామంలో అక్షర ఆంధ్ర - అక్షర పల్నాడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృత్తిక శుక్లా పాల్గొని, ఎస్టీ కాలనీలోని కేంద్రాన్ని పరిశీలించారు. ఎంపీడీవో టీవీ కృష్ణకుమారి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి కూడా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదువుకోవాలని సూచించారు.