ఫిరంగిపురానికి చెందిన షేక్ మొహమ్మద్ జాఫర్ అలి ఈశ్వర్ చిట్స్‌లో రూ. 25 లక్షల చిట్ పూర్తి చేసి, అన్ని వాయిదాలు చెల్లించినా నిర్వాహకులు రూ. 4 లక్షలు మాత్రమే చెల్లించి, మిగిలిన రూ. 21 లక్షలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. బకాయి డబ్బులు కోరితే బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొంటూ సోమవారం నరసరావుపేటలో జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.