ఆందోళన వద్దు.. పెట్రోల్, డీజిల్ కొరత లేదు: DSO

177చూసినవారు
ఆందోళన వద్దు.. పెట్రోల్, డీజిల్ కొరత లేదు: DSO
యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే ప్రచారాన్ని DSO ప్రసాద్ ఖండించారు. జిల్లాలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. వినియోగదారులు అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని సూచించారు. ఎవరైనా గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్‌ను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తే వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్