ఇంటిపై ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం

272చూసినవారు
ఇంటిపై ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం
నరసరావుపేట రూరల్ మండలం పెద్దతురకపాలెం గ్రామంలో ఒక విద్యుత్ స్తంభం ఒరిగిపోయి ఇంటి కప్పుపై ఆనుకొని ప్రమాదకరంగా మారింది. ఇంటి యజమాని ఆలీ, విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని ఆరోపించారు. గ్రామంలో మరికొన్ని స్తంభాల మార్పు జరుగుతున్నా, తన ఇంటి వద్ద ఉన్న స్తంభాన్ని విస్మరించారని ఆయన తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబం నష్టపోతుందని ఆలీ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి స్తంభాన్ని మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్