రైతుల భూములపై ఎండోమెంట్ అధికారుల కన్ను

411చూసినవారు
రైతుల భూములపై ఎండోమెంట్ అధికారుల కన్ను
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం గొళ్లపాడు గ్రామానికి చెందిన రైతు గురజాల కోటేశ్వరరావుకు చెందిన 94 సెంట్ల భూమితో పాటు, కేతముక్కల అగ్రహారంలో సర్వే నెం.703-బిలో ఉన్న 300 ఎకరాలకు పైగా రైతులకు చెందిన భూములను ఎండోమెంట్ అధికారులు 22-ఏ జాబితాలో చేర్చారు. దీనితో భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం నరసరావుపేట ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన చేపట్టి, ఆర్డీవోకు మెమోరాండం సమర్పించారు.

సంబంధిత పోస్ట్