బైక్ ను ఢీకొన్న అగ్నిమాపక వాహనం

674చూసినవారు
బైక్ ను ఢీకొన్న అగ్నిమాపక వాహనం
నరసరావుపేటలో రెడ్డి నగర్ సమీపంలో మంగళవారం అగ్నిమాపక వాహనం అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్​పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్