మార్చి చివరి వరకు సాగునీరు ఇవ్వాలి – ప్రజా సంఘాల డిమ

304చూసినవారు
{"What":"నాగార్జునసాగర్ కుడి కాలువ పరిధిలో ఉన్న రైతులకు పంటలు ఎండిపోకుండా మార్చి చివరి వరకు సాగునీరు అందించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు గురువారం నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిడియం నాయకులు నల్లపాటి రామారావు మాట్లాడుతూ, ప్రస్తుతం అమలు చేస్తున్న వారబందీ విధానం వల్ల పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారబందీని ఎత్తివేసి, కుడికాలువ పరిధిలోని రైతులందరికీ మార్చి చివరి వరకు నిరంతరంగా సాగునీరు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.","Where":"పల్నాడు, న‌ర‌స‌రావుపేట‌","When":"2026-01-29T11:04:40.602Z","Additional info":"మార్చి చివరి వరకు సాగునీరు ఇవ్వాలి – ప్రజా సంఘాల డిమ"}

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్