పల్నాడు జిల్లా నరసరావుపేటలో రావిపాడు గ్రామానికి చెందిన పోతకమూరి శశిల్, గుంట గార్లపాడు పరిధిలోని తన సర్వే నంబర్ 57/2 లో ఉన్న మూడు ఎకరాల యాబై రెండు సెంట్ల స్థలాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేశారని, రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి అమ్ముతున్నారని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని శశిల్ కోరారు. ఫిర్యాదుపై పూర్తి విచారణ జరుపుతామని ఆర్డీవో హామీ ఇచ్చారు.