గుండ్లపల్లి పొలానికి వెళ్లిన వ్యక్తి మిస్సింగ్

0చూసినవారు
గుండ్లపల్లి పొలానికి వెళ్లిన వ్యక్తి మిస్సింగ్
నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన జాను(53) అదృశ్యమవ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. జనవరి 1వ తేదీ సాయంత్రం పొలం వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన ఆయన రాత్రి అయినా ఇంటికి చేరలేదు. బంధువులు వెతుకుతుండగా, శనివారం ఉదయం సాగర్ కాలువ ఒడ్డున ఆయన చెప్పులు, టవల్ కనిపించాయి. దీంతో ఆయన ప్రమాదవశాత్తు కాలువలో పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్