గోపిరెడ్డిపై ఎమ్మెల్యే అరవింద్ బాబు తీవ్ర విమర్శలు

623చూసినవారు
పల్నాడు జిల్లా నరసరావుపేటలో టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నాయకుడు మద్యం, గుట్కా మాఫియాలు, క్రికెట్ బెట్టింగుల్లో నిష్ణాతుడని, అలాంటి వ్యక్తి తనపై మాట్లాడే అర్హత లేదని అరవింద్ బాబు అన్నారు. అమరావతి రాజధాని మద్దతు ఇచ్చి తర్వాత మార్చిన గోపిరెడ్డి పదేళ్లలో నరసరావుపేటకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. బజార్లో కూడా తిరగని వ్యక్తి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండాలని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తీవ్రంగా ఆక్షేపించారు.

సంబంధిత పోస్ట్