నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా నరసరావుపేటలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో యువకులు ఎక్కువగా మరణించడం ఆందోళనకరమని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ తప్పనిసరిగా వాడాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఆయన సూచించారు.