నరసరావుపేటలో 'ఎన్టీఆర్ భరోసా' పంపిణీ

1210చూసినవారు
నరసరావుపేటలో 'ఎన్టీఆర్ భరోసా' పంపిణీ
నరసరావుపేటలో శనివారం తెల్లవారుజాము నుంచే 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ మొదలైంది. ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో, ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పంపిణీ చేపట్టింది. ఎమ్మెల్యే చదలవాడ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వృద్ధులకు రూ. 4000, దివ్యాంగులకు రూ. 6000 అందజేశారు. సకాలంలో ఇంటి వద్దకే పింఛన్ సొమ్ము అందడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోనుగుంట్ల, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్