పీ.ఎం. శ్రీ మోడల్ స్కూల్ ప్రవేశాలకు నేడే చివరి అవకాశం

885చూసినవారు
పీ.ఎం. శ్రీ మోడల్ స్కూల్ ప్రవేశాలకు నేడే చివరి అవకాశం
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం వి.రెడ్డిపాలెం, మార్చి 31: 2026-27 విద్యా సంవత్సరానికి పీ.ఎం. శ్రీ ఏ.పి. మోడల్ స్కూల్‌లో ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు నేడు చివరి అవకాశం. ఈరోజు రాత్రి 11 గంటల వరకు మాత్రమే ఆన్‌లైన్ దరఖాస్తు అవకాశం ఉందని పాఠశాల అధికారులు తెలిపారు. ఇంకా దరఖాస్తు చేయని విద్యార్థులు స్థానిక నెట్ సెంటర్ల ద్వారా లేదా పాఠశాల మొబైల్ (9701030357)కు సంప్రదించి ప్రక్రియ పూర్తి చేయాలని ప్రిన్సిపల్ డాక్టర్. బి. రవి నాయక్ కోరారు.

సంబంధిత పోస్ట్