పల్నాడు జిల్లాలో ఏప్రిల్ 2025 - మార్చి 2026 మధ్య మద్యం అమ్మకాల సేల్ వాల్యూలో 5% వృద్ధి నమోదైంది. గత 12 నెలల్లో రూ.1,142.05 కోట్ల విలువైన 15.14 లక్షల ఇండియన్ మేడ్ లిక్కర్(IML) బాక్సులు, 7.38 లక్షల బీరు బాక్సులు అమ్ముడవ్వగా, ఏప్రిల్ 2024 - మార్చి 2025 మధ్య ఈ గణాంకాలు 13.67 లక్షలు (IML బాక్సులు), బీరు బాక్సులు 4.28 లక్షలుగా, సేల్ వాల్యూ రూ.1,092.75 కోట్లుగా నమోదైంది.