పల్నాడు: నులి పురుగుల నిర్మూలనపై అధికారులతో సమీక్ష

1013చూసినవారు
పల్నాడు: నులి పురుగుల నిర్మూలనపై అధికారులతో సమీక్ష
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 17 నుంచి 24వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నులి పురుగులు నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడుతుంది. పిల్లల ఆరోగ్య సంరక్షణలో ఇది కీలకమైనదని ఆమె పేర్కొన్నారు. ఈ నిర్మూలనపై అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో, అంగన్వాడీలు, పాఠశాలల ద్వారా అర్హులైన పిల్లలకు మాత్రలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్