ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట, తల్లిదండ్రులకు పోలీసుల కౌన్సిలింగ్

521చూసినవారు
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట, తల్లిదండ్రులకు పోలీసుల కౌన్సిలింగ్
నరసరావుపేట రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ను శుక్రవారం ఒక ప్రేమ జంట ఆశ్రయించింది. తమ తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. నరసరావుపేటకు చెందిన దేవర ఉపేంద్ర, వినుకొండకు చెందిన పాలపాటి పావనీ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. గురువారం కనపర్తి చర్చిలో చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఇరువురు మేజర్లు కావడంతో చట్టపరంగా వివాహం చేసుకున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పోలీసులు తల్లిదండ్రులకు సూచించారు. పరస్పర అవగాహనతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తూ కౌన్సిలింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్