నరసరావుపేట మండలం కేసానుపల్లి గ్రామ శివారులో పేకాట శిబిరంపై పోలీసులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 14,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.