కోటప్పకొండ తిరునాళ్లలో దొంగతనాల నివారణకు పటిష్ఠ పోలీసు నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కృష్ణారావు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యక్తులు, చిరు వ్యాపారుల వివరాలను ముందస్తుగా సేకరిస్తున్నామని, భక్తులు తమ విలువైన బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొండపైన, ప్రభల వద్ద భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.