నరసరావుపేట కుమ్మరి బజారులో బహిరంగంగా లాటరీ టికెట్లు విక్రయిస్తున్న గుంటూరు రెడ్డి అలియాస్ శ్రీనివాసరెడ్డి, అతని సోదరులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏజెంట్ల ద్వారా అక్రమంగా లాటరీ టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మట్కా, లాటరీలు,
క్రికెట్ బెట్టింగ్, గంజాయి వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని, సంబంధిత వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కోరారు. ఈ సంఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో చోటుచేసుకుంది.