సచివాలయంలో ఆర్డీవో బాలకృష్ణ ఆకస్మిక తనిఖీ: నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

825చూసినవారు
సచివాలయంలో ఆర్డీవో బాలకృష్ణ ఆకస్మిక తనిఖీ: నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలోని గ్రామ సచివాలయాన్ని బుధవారం ఆర్డీఓ బాలకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆయన సమీక్షించారు. వాట్సాప్ సేవల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రజల నుండి ఫిర్యాదులు రాకుండా పనిచేయాలని, పనితీరులో లోపాలు సహించబోనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ బి.నిర్మల, విఆర్ఓ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్