రెంటచింతల: ట్రాక్టర్‌పై దంపతుల ఘర్షణ.. మహిళకు తీవ్ర గాయాలు

1161చూసినవారు
రెంటచింతల: ట్రాక్టర్‌పై దంపతుల ఘర్షణ.. మహిళకు తీవ్ర గాయాలు
బుధవారం రెంటచింతల మండలం పాలవాయి గేటు సమీపంలో ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న దంపతుల మధ్య జరిగిన వాగ్వాదం ప్రమాదానికి దారితీసింది. ఈ ఘటనలో మంచికల్లు గ్రామానికి చెందిన నాగలక్ష్మి ట్రాక్టర్‌పై నుంచి కిందపడి తలకు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆమెను మొదట మాచర్ల ఆసుపత్రికి, అనంతరం నరసరావుపేటకు తరలించారు. భర్త పరారీలో ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్