నరసరావుపేటలో రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం

2321చూసినవారు
నరసరావుపేటలోని ఉప్పలపాడు వై-జంక్షన్ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్