రోడ్డు ప్రమాద బాధితుడు మృతి

926చూసినవారు
రోడ్డు ప్రమాద బాధితుడు మృతి
వినుకొండ పట్టణంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యుత్ శాఖ డ్రైవర్ రఘు, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. నరసరావుపేట రోడ్డులోని సాయిబాబా ఆలయం సమీపంలో జరిగిన ఈ ఘటనలో రఘు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రఘు మృతితో కుటుంబ సభ్యులు, సహోద్యోగులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్