పల్నాడు జిల్లా కోటప్పకొండ పరిధిలోని పమిడిమర్రు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ వివాదం ఘర్షణకు దారితీసింది. ఒకే కుటుంబంపై గొడ్డళ్లు, కర్రలు, కత్తులతో దాడి జరిగినట్లు బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో గాలం రవణమ్మ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సర్వే రాళ్లు తొలగించి బెదిరింపులకు పాల్పడ్డారని, తమకు రక్షణ కల్పించాలని బాధిత కుటుంబం అధికారులను కోరుతోంది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.