శనివారం అద్దంకి- నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారిపై పిడుగురాళ్ల నుంచి ఒంగోలు వైపు వెళుతున్న కారు, రొంపి చర్ల వద్ద రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కారులో ఉన్నవారు ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో పట్టణంలోని వైద్యశాలకు తరలించారు. గాయపడినవారు గుంటూరు జిల్లాకు చెందినవారు.