రొంపిచర్లలో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

1476చూసినవారు
బుధవారం రొంపిచర్ల మండలం అన్నవరం గ్రామం వద్ద ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణమధ్యలో బస్సుకు టైరు పంచర్ కావడంతో అదుపు తప్పిన వాహనం రోడ్డుపక్కనున్న లంక వైపు దూసుకెళ్లింది. అయితే, డ్రైవర్ అప్రమత్తతతో బస్సును అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ సమయస్ఫూర్తిని స్థానికులు ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్