పల్నాడు జిల్లాలో డ్వాక్రా రుణాల అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అవసరమైతే ఆస్తులను జప్తు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్ లో మెప్మా, డిఆర్డీయే అధికారులతో నిర్వహించిన సమావేశంలో, తప్పుడు ధ్రువపత్రాలు, ఫోటోలతో నకిలీ సంఘాలు సృష్టించి రుణాలు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్తుల అమ్మకాలను అడ్డుకోవాలని కూడా సూచించారు.