కేసానుపల్లి వద్ద ఉద్రిక్తత.. రోడ్డెక్కిన మహిళలు

3408చూసినవారు
నరసరావుపేట మండలం కేసానుపల్లి ఎల్‌టీ నగర్‌లో సోమవారం రాజకీయ విభేదాల నేపథ్యంలో మహిళలు రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు. గ్రామంలో నెలకొన్న రాజకీయ విభేదాలకు వీఆర్వో కారణమని ఆరోపిస్తూ వారు ఆందోళన చేశారు. ఈ నిరసనల కారణంగా కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్