పల్నాడు జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా తిలక్ నాయక్

483చూసినవారు
పల్నాడు జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా తిలక్ నాయక్
పల్నాడు జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా వినుకొండకు చెందిన తిలక్ నాయక్ నియమితులయ్యారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు ఏలూరు శశికుమార్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు తిలక్ కృతజ్ఞతలు తెలిపారు. ఎస్టీ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తూనే, కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలోకి విస్తృతంగా తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్