నరసరావుపేట రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతి

593చూసినవారు
నరసరావుపేట రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతి
పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో రైల్వే ట్రాక్‌పై విషాద ఘటన చోటుచేసుకుంది. సుమారు 35-40 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కిలోమీటర్ నంబర్ 43/7–43/6 వద్ద అకస్మాత్తుగా పట్టాలపైకి వచ్చిన వ్యక్తిని రైలు ఢీకొట్టింది. లోకో పైలట్ రైలును ఆపి పరిశీలించగా, అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన బాబాపేట బ్రిడ్జి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై చోటుచేసుకుంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్