పోలీసుల వేధింపులు, రూ.22 లక్షలు కాజేశారని బాధితుల ఆరోపణ

2291చూసినవారు
క్రికెట్ బెట్టింగ్ కేసులో అరెస్టైన సవాని రవితేజ కుటుంబ సభ్యులను నరసరావుపేట రెండో పట్టణ పోలీసులు వేధిస్తున్నారని బాధితులు ఆరోపించారు. గురువారం ఉదయం రవితేజ భార్య ఉపాసి లలితను అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేస్తున్నారని తెలిపారు. అలాగే రూ.22 లక్షలు పోలీసులు కాజేశారని ఆరోపిస్తూ, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్