గోల్డ్ శేఖర్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని బాధితుల డిమాండ్

3283చూసినవారు
క్రికెట్ బెట్టింగ్, ట్రేడింగ్ పేరుతో యువతను మోసం చేసి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గోల్డ్ శేఖర్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బాధితులు, ప్రజాసంఘాల నాయకులు సోమవారం నరసరావుపేట కలెక్టరేట్‌లో ధర్నా నిర్వహించి డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. గోల్డ్ శేఖర్‌కు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుని, వాటి ద్వారా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. త్వరితగతిన కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్