పర్చూరు వెలుగు కార్యాలయంలో నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన ఎంపీడీవోలు, మండల స్థాయి అధికారులతో నియోజకవర్గ ప్రత్యేక అధికారి డ్వామా పీడీ విజయలక్ష్మి శుక్రవారం సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమంలో భాగంగా పర్చూరు నియోజకవర్గ విజన్ ప్లాన్ తయారీకి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. నియోజకవర్గ విజన్ ప్లాన్ కమిటీ ఛైర్మన్ గా ఎమ్మెల్యే ఉంటారని చెప్పారు.