
పెదకూరపాడు: అడవిని తలపిస్తున్న జగనన్న కాలనీ
పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామంలోని జగనన్న కాలనీకి వెళ్లే రోడ్డు అడవిని తలపిస్తోంది. గత రెండేళ్లుగా మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ముళ్లపొదలు పెరిగిపోయాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణాలు చేపట్టే ముందు మౌలిక వసతులు కల్పించి, ముళ్లపొదలను తొలగించాలని వారు కోరుతున్నారు.





































