గుంటూరు జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఏఆర్ (AR) సిబ్బందికి రెండు వారాల వార్షిక మోబిలైజేషన్ శిక్షణ గురువారం ప్రారంభమైంది. ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ హనుమంతు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. సిబ్బందిలో క్రమశిక్షణ, అప్రమత్తత పెంచడమే లక్ష్యమని, ఏఆర్ విభాగం పోలీస్ వ్యవస్థకు వెన్నెముక వంటిదని ఎస్పీ పేర్కొన్నారు. ముఖ్యంగా వీవీఐపీ భద్రత, బందోబస్తు విధుల్లో వృత్తి నైపుణ్యం ప్రదర్శించాలని ఆయన సూచించారు.