గారపాడులో భవనారుషి స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం

242చూసినవారు
పెదకూరపాడు మండలం గారపాడు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనా ఋషి స్వామి వారి దేవాలయం కొరకు విగ్రహ ప్రతిష్టా మహోత్సవ సుముహూర్తం ఆదివారం సాయంత్రం ఆలయ నిర్మాణ స్థపతి, గ్రామ పెద్దలు, పద్మశాలి కుల బంధువుల సమక్షంలో శుభ నవాంశంలో జరిగింది. విగ్రహ ప్రతిష్టా, ధ్వజస్తంభం (ప్రాణ ప్రతిష్ట) అనేది శాస్త్రబద్ధమైన పవిత్ర కర్మకాండ. దీని కోసం ముహూర్త నిర్ణయం చాలా ముఖ్యమైనది కావున వేద పండితులు, ఆగమ శాస్త్రజ్ఞులు దీనిని నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్