పెదకూరపాడు గ్రామ శివారులో ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడటంతో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. పెదకూరపాడు–అమరావతి రహదారిలో రాయపూడి సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇచ్చి బాధితుడిని పెదకూరపాడు సీహెచ్‌సీకి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రాథమికంగా అతడు మద్యం మత్తులో వాహనం నడిపినట్లు వైద్యులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.