అచ్చంపేట మండలం నీలేశ్వరపాలెంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ, సిసీ రోడ్లను బుధవారం పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. అనంతరం స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు చర్యలు తీసుకుంటామని, అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.