పల్నాడు జిల్లా, పెదకూరపాడు మండలం, ఎర్రబాలెం గ్రామంలో 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. పెదకూరపాడు శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ మరియు వేపూరి లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు, టిడిపి కార్యకర్తలు, నాయకులు, మరియు తెలుగుయువత సెక్రెటరీ గోపి కుంభా ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా వృద్ధులు, పేదల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.