యువతి మృతదేహం వద్ద డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ దర్యాప్తు

2203చూసినవారు
అమరావతి పరిధిలోని లింగాపురం చెరువు కట్ట సమీపంలో సోమవారం ఓ ప్రైవేటు వెంచర్‌లో గుర్తుతెలియని యువతి అనుమానాస్పద స్థితిలో మృతదేహంగా కనిపించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజశేఖర్, పోలీసు సిబ్బంది, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతురాలి తలపై ఉన్న జుట్టును తొలగించిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యువతి గుర్తింపు, మృతికి గల కారణాలు, ఇది హత్యేనా లేక ఇతర కారణాలా అనే అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్