నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సభ్యుడు దేవల్లా కోటేశ్వరరావు ప్రమాదవశాత్తూ మృతి చెందడంతో, ఆయన కుటుంబానికి పార్టీ అండగా నిలిచింది. సత్తెనపల్లి శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం నేరుగా కోటేశ్వరరావు కుటుంబానికి ₹5 లక్షల చెక్కును అందజేశారు. టీడీపీలో సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, వారి సంక్షేమం కోసం బీమా సౌకర్యం కల్పించి, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.