కృష్ణానది పరివాహక ప్రాంతంలో దిడుగు నుంచి ఏటూరు పడవ సేవలకు టెండర్ ప్రక్రియ బుధవారం జడ్పీ కార్యాలయంలో పూర్తయింది. ఈ టెండర్ ప్రక్రియలో అచ్చంపేట, అమరావతి మండలాల నుంచి పలువురు టెండర్లు పాల్గొన్నారు. ఫిట్‌నెస్, సారంగు, ఇన్సూరెన్స్, లైసెన్స్ పత్రాలు సమర్పించినవారే అర్హులని అధికారులు తెలిపారు. దిడుగు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అన్ని డాక్యుమెంట్లతో పాటు ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను సమర్పించడంతో టెండర్ గెలుచుకున్నారు. ఆయన ప్రజలకు మెరుగైన పడవ సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు.