గుడ్ న్యూస్: భూములు నిషేధిత జాబితా నుంచి తొలగింపు

391చూసినవారు
గుడ్ న్యూస్: భూములు నిషేధిత జాబితా నుంచి తొలగింపు
నూతన సంవత్సరం సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక నిర్ణయం ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 22-A నిషేధిత భూముల జాబితాలో ఉన్న ఐదు రకాల భూముల్లో కొన్ని విభాగాలను తొలగించేందుకు ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. ముఖ్యంగా ప్రైవేట్ భూములను పూర్తిగా 22-A జాబితా నుంచి తీసివేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే స్వాతంత్ర్య సమరయోధులు, ప్రస్తుత మరియు మాజీ సైనిక ఉద్యోగులకు సంబంధించి సరైన భూ పత్రాలు ఉంటే, వారి భూములను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. మిగిలిన నాలుగు రకాల భూముల అంశాలపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్