పెదకూరపాడు మండలంలో ఆదివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షం కురిసింది. ఎండ తీవ్రతతో ఉక్కపోత నెలకొన్న తర్వాత ఆకాశం మేఘావృతమై జోరుగా వర్షం కురిసింది. దీనితో మండలవ్యాప్తంగా వాతావరణం ఆహ్లాదకరంగా మారి ప్రజలు ఉపశమనం పొందారు. అయితే, ఆకస్మిక వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్ల పక్కన వ్యాపారం చేస్తున్న
చిరు వ్యాపారులు తమ సరుకులను కాపాడుకోవడానికి హడావుడి పడ్డారు.