చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ వద్ద అక్రమ స్తంభాలు: వాకర్ల ఆందోళన

1280చూసినవారు
గుంటూరు తూర్పులోని చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా హోర్డింగ్‌ల కోసం తొమ్మిది భారీ స్తంభాలను ఏర్పాటు చేయడాన్ని స్థానిక వాకర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంపై మున్సిపల్, దేవాదాయ శాఖ అధికారులను సంప్రదించగా, తమకు ముందస్తు సమాచారం లేదని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహించిన స్థానికులు, అక్రమంగా స్తంభాలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.

సంబంధిత పోస్ట్