గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో శుక్రవారం సాయంత్రం మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ, స్థానిక వ్యాపారులను పలకరించారు. పాత సత్యనారాయణ టాకీస్ రోడ్‌లోని జిలేబి దుకాణం వద్ద ఆగి, తెనాలి ఫేమస్ జిలేబిని రుచి చూశారు. అనంతరం స్థానిక వ్యాపారులతో ముచ్చటించి వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నారు. మూడు గంటలకు పైగా సాగిన ఈ పర్యటన స్థానికుల దృష్టిని ఆకర్షించింది.