అప్పు చెల్లించలేదని ఇంటి గేటు వద్ద ఇసుక పోసిన వడ్డీ వ్యాపారి

891చూసినవారు
పల్నాడు జిల్లా అచ్చంపేటలో అప్పు వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం, వడ్డీ వ్యాపారి శంకర్, అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో బాధితుడి ఇంటి గేటు వద్ద ఇసుక రాశి పోయించాడు. దీనితో ఇంట్లోని కుటుంబ సభ్యులు బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు. అనారోగ్యంతో ఉన్న కుటుంబ పెద్ద పరిస్థితిని కూడా పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని బాధితుడి కుమారుడు నవీన్ అధికారులను కోరాడు.

సంబంధిత పోస్ట్