అమరావతి మండలం లింగాపురంలో జరిగిన యువతి హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. తలపై రాయితో బలంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతురాలు పిడుగురాళ్లకు చెందిన యువతి అని సీఐ అచ్చయ్య తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అమరావతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.