సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్య పదజాలాన్ని ఆదివారం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్రంగా ఖండించారు. అంబటి రాంబాబు వెంటనే సీఎం చంద్రబాబుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు దూషించేవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది సహించరానిదని ఆయన విమర్శించారు.