పులిచింతల ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. పై ప్రాంతాల నుంచి మరింత ప్రవాహం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, అమరావతి మండలంలోని కృష్ణా పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐఐ రాజశేఖర్ సూచించారు. వరద తగ్గే వరకు గొర్రెల కాపరులు నదిలోకి వెళ్లరాదని, పడవలు నడపకూడదని సీఐ వై. అచ్చయ్య హెచ్చరించారు.